Hyderabad Rains Trending After Heavy Rain Fall Causes Floods, Pics And Videos Goes Viral - Sakshi
Sakshi News home page

వీడియోలు: వానొచ్చేనంటే.. వరదనే వస్తది!.. ట్రెండింగ్‌లో హైదరాబాద్‌ వానలు

Apr 29 2023 11:13 AM | Updated on Apr 29 2023 11:54 AM

Hyderabad Rains Trending After Heavy Rain Fall Causes Floods - Sakshi

వానపడితే అక్కడక్కడ నీళ్లు నిలవడం సహజమే అంటూ ఆ మంత్రి..

ట్విటర్‌ ట్రెండింగ్‌లో హైదరాబాద్‌రెయిన్స్‌ #HyderabadRains రెండో ప్లేస్‌ నుంచి పైపైకి పోతోంది. శనివారం ఉదయం రెండున్నర గంటలపాటు గట్టిగా దంచికొట్టిన వానకి.. నగరంలోని దుస్థితి తెలియజేస్తూ పోస్ట్‌ చేస్తున్న వీడియోలు, ఫొటోల తాలుకా ఎఫెక్ట్‌ ఇది. కేవలం విపక్ష నేతలే కాదు.. నగర పౌరులు కూడా ఈ ట్రెండింగ్‌లో పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

‘‘వాన పడితే.. అక్కడక్కడ నీళ్లు నిలవడం సహజం. మహా మహా నగరాలకే అది తప్పదు. ఆ మాత్రం దానికే అతిచేస్తార’ని ఆ మధ్య ఓ మంత్రి  మీడియాకు చురకలు అంటించాననుకున్నారు. కానీ, ఇప్పుడు కురిసింది ఎండకాలంలో కురిసిన అకాల వర్షం.. అదీ కొద్దిసేపు కురిస్తేనే నగరం చెరువులను తలపించింది. ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది.  

రాంనగర్‌, మైండ్‌స్పేస్‌.. ఇలా పలు చోట్ల ఏకంగా వరద ఉధృతికి టూవీలర్లు కొట్టుకుపోయి నాలాలో కలిసిపోయిన పరిస్థితి. తిండికి, తాగునీరు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్‌ సరఫరా, రవాణ వ్యవస్థకి అంతరాయం ఏర్పడింది.  వీటి సంగతి సరే.. జీహెచ్‌ఎంసీ మ్యాన్‌హోల్‌ నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం బలైంది. 

మీడియా సంగతి సరే.. మరి ఆ మంత్రిగారు పౌరులు వ్యక్తం చేస్తున్న సోషల్‌ మీడియా నిరసనలపై ఏం సమాధానం ఇస్తారో!. అసలే ఈ మధ్య వానాకాల సమీక్ష సైతం నిర్వహించారాయన.  మరి ముందుంది వానా కాలం. పరిస్థితి ఇంకా ఎంత నరకంగా ఉండబోతుందో అనే ఊహతో ఇప్పటి నుంచే భయపడిపోతున్నారు నగరవాసులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement