Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Hyderabad: MMTS First Class Tickets Fare Cheaper by 50 Percent From May 5 - Sakshi

ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు 50 శాతం తగ్గింపు

ఈ నెల 5 నుంచి రేట్లు అమల్లోకి

సాక్షి, హైదరాబాద్‌: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్‌ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్‌లో సబర్బన్‌ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో ప్రతి సింగిల్‌ రూట్‌  ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌  తెలిపారు. 

ఈ మేరకు  గ్రేటర్‌లోని  సికింద్రాబాద్‌– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్‌– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్‌ వరకు 29 స్టేషన్‌ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్‌.. కథ మొత్తం కారు నుంచే..)

50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్‌ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్‌ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్‌ రద్దు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top