పిల్లర్‌కు పగుళ్లంటూ ప్రచారం.. ఖండించిన మెట్రో అధికారులు | Hyderabad Metro Clarifies: No Cracks in Pillar, Only Chemical Stains | Sakshi
Sakshi News home page

పిల్లర్‌కు పగుళ్లంటూ ప్రచారం.. ఖండించిన మెట్రో అధికారులు

Jun 4 2026 9:31 PM | Updated on Jun 4 2026 9:31 PM

Hyderabad Metro Clarifies: No Cracks in Pillar, Only Chemical Stains

సాక్షి,హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఖండించారు. గురువారం అమీర్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో అక్కడి ప్రకటన బోర్డులు కాలిపోయాయి. ఆ బోర్డులలోని కెమికల్ లిక్విడ్‌ పిల్లర్‌పై పడడంతో మరకలు ఏర్పడ్డాయి. అవి పగుళ్లలా కనిపించడంతో కొందరు అపోహలు పడ్డారు.

ఆ అపోహలపై అధికారులు వివరణిచ్చారు. బిల్‌బోర్డు కాలిపోవడం వల్ల వచ్చిన కెమికల్ మరకలు మాత్రమే పిల్లర్‌పై కనిపించాయి. వాస్తవానికి పిల్లర్‌కు ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదని స్పష్టం చేశారు. నిపుణుల బృందం తనిఖీలు నిర్వహించి, పిల్లర్‌ సురక్షితంగానే ఉందని నిర్ధారించింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, మెట్రో పిల్లర్లు బలమైన నిర్మాణ ప్రమాణాలతో నిర్మించబడ్డాయని భరోసా ఇచ్చారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని, మెట్రో సేవలు ఎప్పటిలాగే సురక్షితంగా కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement