ఎంఎంటీఎస్‌ రైలులో కత్తితో హల్‌చల్‌

Hyderabad: Man Created Hulchul With Knife In MMTS Train - Sakshi

ఉద్యోగినికి ఆగంతుకుడి బెదిరింపులు

సెల్‌ఫోన్, నగదుతో పరార్‌

బోరబండ వద్ద ఘటన  

సాక్షి, నాంపల్లి: ఎంఎంటీఎస్‌ రైలులో ఓ ఆగంతుకుడు హల్‌చల్‌ సృష్టించాడు. కత్తితో మహిళా బోగీలోకి దూరి బెదిరింపులకు దిగాడు. సెల్‌ఫోన్, నగదుతో పరారైన ఘటన నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బోరబండ రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ చెప్పిన వివరాల ప్రకారం.. మణికర్ణ అనే మహిళ సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టంలో (సీఆర్‌ఐఎస్‌) సీనియర్‌ ప్రాజెక్టు ఇంజినీరుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బేగంపేట రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
చదవండి: Hyderabad RRR: అలైన్‌మెంట్‌.. ఆల్‌రైట్‌!

రాత్రి సుమారు 10.37 గంటలకు  లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కారు. ఆమెతో పాటు ఆ బోగీలో మరో మహిళ ఉన్నారు. సదరు మహిళ ఫతేనగర్‌ రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. రైలు బోరబండ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే గుర్తు తెలియని ఆగంతుకుడు మహిళా బోగీలోకి ప్రవేశించి మణికర్ణను కత్తితో బెదిరించాడు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను, నగదును లాక్కెళ్లాడు. బాధితురాలు చందానగర్‌ రైల్వే స్టేషన్‌లో దిగి ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top