హృదయ విదారకం: చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం​

Hyderabad: Infant Baby Corpse Found In Dustbin Rajendra Nagar - Sakshi

తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగత జీవిగా మారిందో పసికందు. అప్పుడే పుట్టిన పాపాయికి.. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని చూడక ముందే కన్నుమూసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పడే పట్టిన ఓ పసికందు మృతదేహం చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించేందుకు రాగా చెత్తకుప్పల పక్కనే ఉన్న మూటలో చిన్నారి మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువుని చంపి మూటలో కట్టి చెత్త కుప్పలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

చదవండి: Extra Marital Affair​:‍ వాటర్‌మెన్‌తో పరిచయం, భర్తతో కలిసి ఉండలేక..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top