Corona: పాజిటివ్‌ వచ్చిందని ప్రాణం తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

Hyderabad: Depressed Covid positive Techie ends life in Alwal - Sakshi

సాక్షి, అల్వాల్‌: కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందన్న మానసిక వేదనతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అల్వాల్‌ ఏఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అల్వాల్‌ కానాజీగూడలోని మానస సరోవర్‌ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అస్వస్థతకు గురవడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా తేలింది.

అప్పటినుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులతో సైతం ఫోన్‌లో మాట్లాడింది. రెండు రోజుల అనంతరం 23వ తేదీ సాయంత్రం ఫోన్‌ మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: మనిషి చర్మం, ప్లాస్టిక్‌పై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top