Telangana: రద్దీ ఎప్పటిలాగే..

Hundreds Of People Violating The Covid Norms And Gathering In Telangana - Sakshi

సాక్షి, జగిత్యాల: లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

వ్యాపారులకు ఊరట
లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. 

భౌతికదూరం మరిచారు
ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-06-2021
Jun 11, 2021, 07:58 IST
న్యూఢిల్లీ: ప్రజలు కోవిడ్‌ టీకా పొందేందుకు కోవిన్‌ యాప్‌లో పేరు నమోదు తప్పని సరి చేయడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌...
11-06-2021
Jun 11, 2021, 01:29 IST
►పిల్లల్లో కోవిడ్‌–19 వస్తే... తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. ►సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస...
10-06-2021
Jun 10, 2021, 17:10 IST
ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడ్డారు. ఉన్నట్టుండి కరోనా రూపంలో మృత్యువు ఆయనను కాటేసింది.
10-06-2021
Jun 10, 2021, 14:51 IST
సాక్షి, నారాయణఖేడ్‌: ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28...
10-06-2021
Jun 10, 2021, 14:32 IST
►కోవిడ్‌ నుంచి రికవరీ అయిన వెంటనే రోజువారీ విధులు, పనులకు ఉపక్రమించకుండా కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఏదైనా శారీరక శ్రమ,...
10-06-2021
Jun 10, 2021, 12:06 IST
సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు....
10-06-2021
Jun 10, 2021, 09:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా  94,052 కరోనా...
10-06-2021
Jun 10, 2021, 09:09 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? అందులో ఏమైనా తప్పులు దొర్లాయా? కంగారు అక్కర్లేదు. కోవిన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లో...
10-06-2021
Jun 10, 2021, 08:52 IST
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని సింఘాల్‌ తెలిపారు. ఒక డోసు తీసుకున్నవారు 58...
10-06-2021
Jun 10, 2021, 08:37 IST
ముంబై: శత్రువును అంతంచేయాలంటే సరిహద్దు దాటి మన భూభాగంలోకి వచ్చేదాకా ఆగుతానంటే కుదరదని, దూకుడుగా ముందుకెళ్లి ‘సర్జికల్‌’ దాడి చేయాలని...
10-06-2021
Jun 10, 2021, 04:58 IST
సాక్షి, హైదరాబాద్‌: సమయం లేదు మిత్రమా.. శరణమా... రణమా? తేల్చుకోవాల్సిన తరుణమిదే!! ఊహూ.. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా డైలాగ్‌ ఏమాత్రం...
10-06-2021
Jun 10, 2021, 02:01 IST
వాషింగ్టన్‌: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు...
10-06-2021
Jun 10, 2021, 01:37 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తోంది. చిన్నారులు సైతం వైరస్‌ బారినపడుతున్నారు. అయితే, వారిలో లక్షణాలు అంతగా కనిపించడం...
09-06-2021
Jun 09, 2021, 18:29 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,766 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
09-06-2021
Jun 09, 2021, 16:57 IST
చనిపోయాక ఎక్స్‌గ్రేషియా కన్నా.. బతికేందుకు అవకాశం ఇవ్వాలని, నిధులు సమకూర్చాలంటూ వేడుకున్న డీఎస్పీ లెవెల్​ అధికారి ఇక లేరు.  పంజాబ్‌కు చెందిన డిప్యూటీ...
09-06-2021
Jun 09, 2021, 15:13 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవో  కీలక విషయాన్ని ప్రకటించింది.  ఈ డ్రగ్‌ను...
09-06-2021
Jun 09, 2021, 14:45 IST
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉండగా సోషల్ మీడియా కోసం వీడియోలను చేసిన ఢిల్లీ చెందిన ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి షో కాజ్ నోటీసు...
09-06-2021
Jun 09, 2021, 13:44 IST
సాక్షి, హైదరాబాద్‌:  టీకా కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీకి నిర్ణయం తీసుకున్న...
09-06-2021
Jun 09, 2021, 13:42 IST
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...
09-06-2021
Jun 09, 2021, 12:13 IST
హాంకాంగ్‌ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్‌న్యూస్.  హాంకాంగ్‌ నగరంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన వారికి  ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top