భర్త బాధ్యతలో సగం..

House Wife Performs Household Chores As Well As Works As Teacher  - Sakshi

వేంసూరు: గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. భర్త ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఉచితంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఉషారాణి. వేంసూరు మండలం అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతుల వరకు 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నక్కా మోహన్‌రావు ఒక్కరే ఏడు తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు.

(చదవండి: పాత కార్లు, సైకిల్‌ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!)

ఏడు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోహన్‌రావు పాఠాలు బోధించడంతో మానసికంగా, శారీరంగా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. ఇది గమనించిన ఆయన సతీమణి ఉషారాణి భర్తకు సాయంగా నిలవడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధించాలనే సంకల్పంతో తాను కూడా పాఠశాలకు వెళ్లోంది. డీఈడీ చదవడంతో లాక్‌డౌన్‌ తరువాత పాఠశాల తెరిచిన దగ్గరి నుంచి నేటి వరకు తన భర్తతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా పాఠశాలకు తీసుకువెళ్లి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా విద్యార్థులకు సేవ చేస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు.

(చదవండి: రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top