ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో అపశ్రుతి.. కాబోయే జంటపై తేనెటీగల దాడి 

Honey Bee Attack On Bride Groom In Pre Wedding Shoot At Koheda - Sakshi

ఇటీవలి కాలంలో ఫోటోషూట్‌లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్‌ షూట్‌ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్‌లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్‌ పేరుతో ప్రమాదలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు.

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌ : ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్‌ రాక్‌టౌన్‌ కాలనీకి చెందిన అనురాగ్‌రెడ్డి, శివానికి వివాహం కుదిరింది. ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం ఈనెల 11న కోహెడలోని ఔటర్‌ పరిసరాల్లోకి వచ్చారు. ఫొటో షూట్‌లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో  అక్కడే ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అదే రోజు సాయంత్రం డిశ్చార్జి అయినట్లు తెలిసింది.  
చదవండి: అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డ్‌ రామకృష్ణ మృతి.. పరువు హత్య?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top