తెలంగాణలో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం | High Court Decided To Open All Courts In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం

Nov 8 2020 4:59 PM | Updated on Nov 8 2020 6:53 PM

High Court Decided To Open All Courts In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాన్ని హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్‌, క్రిమినల్‌ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్‌ 31 వరకు ప్రస్తుత ఆన్‌లైన్‌, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement