
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములు.. ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ.. కాచిగూడ, అబిడ్స్, కోఠి, ట్యాంక్‌బండ్, నాంపల్లి, ఖైరతాబాద్.. కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సిద్ధిపేటలో గాలి వర్షానికి కౌంటింగ్ కేంద్రం వద్ద టెంట్లు కుప్ప కూలాయి.