ఈటల కావాలా? టీఆర్ఎస్‌ కావాలా? అన్నది చర్చ పెట్టాలి: హరీశ్‌ రావు | Harish Rao Demands That Should Be Discussed Who Need Etela Or TRS | Sakshi
Sakshi News home page

ఈటల కావాలా? టీఆర్ఎస్‌ కావాలా? అన్నది చర్చ పెట్టాలి: హరీశ్‌ రావు

Aug 8 2021 8:18 PM | Updated on Aug 8 2021 9:00 PM

Harish Rao Demands That Should Be Discussed Who Need Etela Or TRS - Sakshi

ఫైల్‌ ఫోటో

సిద్దిపేట: దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై  అధికార, ప్రతిపక్ష నేతలు విమర్షలు గుప్పించుకుంటున్నారు. దళితబంధు పథకానికి బండి సంజయ్‌ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారని, కానీ తమ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని హరీశ్‌ రావు అన్నారు. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్‌ తేవాలని అడిగారు.

ఇక రైతు బంధు, దళిత బంధు దండగ అని ఈటల అంటున్నారని, ఈటల కావాలా? టీఆర్ఎస్‌ కావాలా? అన్నది చర్చ పెట్టాలని మంత్రి హరీశ్‌ రావు  డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ ఓటు అడిగే ముందు.. రైతుబంధు, దళితబంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని హరీశ్‌ రావు అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తేవాలని హరీశ్‌ రావు  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement