డిజిటల్‌ అంతరాలు అధిగమించాలి

Governor Tamilisai Soundararajan Speaks About Online Teaching - Sakshi

ఆన్‌లైన్‌ బోధనపై గవర్నర్‌ తమిళి సై 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ విద్యాఫలితాలు అందుకోలేని విద్యార్థులకు చేరువయ్యేందుకు విద్యావేత్త లు, విద్యాసంస్థలు కృషి చేయాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ సూచించారు. గాడ్జెట్లు, ఇంటర్నె ట్‌ సౌకర్యం లేని విద్యార్థులను చేరుకోవడంలో విఫలమైతే ‘డిజిటల్‌ అంతరాలకు’ దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించి, అందరికీ డిజిటల్‌ బోధన సక్రమంగా అందేలా మౌలిక వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరంగల్‌ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్స్‌ ఫర్‌ ది న్యూ నార్మల్‌’ వర్చువల్‌ సదస్సులో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆన్‌లైన్‌ విద్యా విధానంలో కీలకమైన ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫో న్లు, ఇతర గాడ్జెట్లు మారుమూల, గిరిజన ప్రాంతా ల విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. ఆన్‌లైన్‌ విద్యను అందుకునేందుకు మారుమూల ప్రాంత విద్యార్థులు చెట్లు, ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతున్న విషయాన్ని గవర్నర్‌ ఉదహరించారు. అందువల్ల ఆన్‌లైన్‌ విద్యాఫలితాలు అం దరికీ అందేలా మౌలిక వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నూతన భారత్‌ నిర్మాణానికి వినూత్న ఆవిష్కరణల అవసరం ఉందని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, సదస్సు సమన్వయకర్త డాక్టర్‌ తిరువెంగళాచారి, ప్రొఫెసర్‌ జి.శ్రీనివాస్, ప్రొఫెసర్‌ గిరిజా శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top