
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ‘పునర్వసు’జన్మ నక్షత్రంలో జన్మించిన శ్రీరాముడు తన ఆదర్శ గుణాలతో ధర్మమూర్తిగా పేరుగాం చాడని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటా భక్తి, అంకితభావంతో ఉత్సవాలను జరుపుకొంటారని పేర్కొన్నారు. ధర్మావతారమైన శ్రీరాముడి నుంచి మనమంతా సన్మార్గంలో బతకడానికి ప్రేరణ పొందామని తెలిపారు.