
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల తిరస్కరణపై దాశోజు శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది.
శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు.. ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టుకు తెలియజేశారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ