బరిలో తోడల్లుళ్లు.. జూపల్లికే ఓటర్లు పట్టం

GHMC Election Results: Jupally Satyanarayana Wins In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్విప్‌ చేసింది. ఈ డివిజన్‌ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్‌పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్‌పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్‌ కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్‌పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్‌రావు నగర్‌, ఉప్పల్‌లో కాంగ్రెస్‌ గెలుపు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top