గద్వాల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త ఆడియో వైరల్‌

Gadwal ZP Chairperson Husband Audio Viral - Sakshi

సోషల్‌ మీడియాలో ఫోన్‌ సంభాషణ చక్కర్లు 

గద్వాల్‌ రూరల్‌: గద్వాల్‌ సీఐగా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన హనుమంతుతో జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తిరుపతయ్య ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు శనివారం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తి గతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారానికి సంబంధించి కేసు విషయంలో తిరుపతయ్య.. హనుమంతుతో ఫోన్‌లో మాట్లాడుతూ గట్టు మండల పోలీసు శాఖ అధికారి, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఈ సంభాషణ ఎంతవరకు వాస్తవం, ఇది తాజాదా, లేక గతంలో మాట్లాడిన సంభాషణా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా గద్వాల టీఆర్‌ఎస్‌లో వర్గవిభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫోన్‌ సంభాషణతో మరోమారు స్పష్టమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top