సరుకు రవాణా ఇక సులభంగా.. | First Goods Train To Delhi From Hyderabad | Sakshi
Sakshi News home page

సరుకు రవాణా ఇక సులభంగా..

Jul 27 2020 4:01 AM | Updated on Jul 27 2020 4:01 AM

First Goods Train To Delhi From Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్‌) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే తొలిసారి పట్టాలెక్కించబోతోంది. దీన్ని హైద రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించనుండటం విశేషం. ఇది ఎక్స్‌ప్రెస్‌ రైలు కావటం మరో విశేషం. సనత్‌నగర్‌ స్టేషన్‌ నుంచి కొత్త ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌కు రైలు నడవనుంది. ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఈ సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ ప్రతి బుధవారం సనత్‌నగర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. సాధారణంగా ఒక రేక్‌ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్‌ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. 

చిరు వ్యాపారులను ఆకట్టుకునేలా..
కనిష్టంగా 60 టన్నుల సరుకు వరకు అనుమతి స్తారు. ఇది చిన్న వ్యాపారులకు ఎంతో ఉపయోగం. ఇప్పటివరకు ఓ రైలు మొత్తాన్ని బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. లేదా, చిన్న వ్యాపారులు అంతా కలిపి అయినా బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా, 60 టన్నుల సరుకు ఉంటే చాలు అనుమతిస్తారు. ఇప్పటివరకు ఈ వసతి లేకపోవ టం వల్ల చిరు వ్యాపారులు విధిగా లారీలతో రోడ్డు మార్గాల ద్వారా సరుకు పంపేవారు. దీని వల్ల వ్యయం ఎక్కువగా ఉంటోంది.

సరుకు రవాణా రూపంలో ఆదాయాన్ని పెంచుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న దక్షిణ మధ్య రైల్వే, చిరు వ్యాపారుల కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనికి రైల్వే బోర్డు అనుమతించటంతో సమయ పాలనతో కూడిన తొలి సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కిం చేందుకు సిద్ధమైంది. సనత్‌నగర్‌ స్టేషన్‌ పారిశ్రామిక కేంద్రాలకు సమీ పంలో ఉన్నందున దాన్ని ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి నిత్యం సరుకు రవాణా అవుతూనే ఉంటుంది. దీంతో ఆ రూపంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ కొత్త రైలు దోహదం చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. రైల్వేకు ఆదాయపరంగానే కాకుండా చిరు వ్యాపారులకు ఇది ఎంతో ఉపయు క్తంగా ఉంటుందని ఆయన చెప్పారు.

సనత్‌నగర్‌ నుంచి 1,700 కి.మీ. దూరంలో ఉన్న కొత్త ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌ స్టేషన్‌కు కేవలం 34 గంటల్లో ఈ రైలు చేరుకోనుంది. ప్రతి బుధవారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం ఉదయం ఇది గమ్యం చేరుతుంది. టన్నుకు రూ.2,500 చార్జీ వసూలు చేస్తారు. కొన్ని రకాల వస్తువులకు ఈ ధర వేరుగా ఉండనుంది. రోడ్డు మార్గాన సరుకు చేరÐఇంటి నుంచి పని..ólయాల న్నా, ప్రస్తుత సరుకు రవాణా రైల్వే టారిఫ్‌తో పోలిస్తే ఈ ధర 40 శాతం తక్కువ కావటం విశేషం. వివరాలకు 9701371976, 040–27821393 నంబ ర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement