సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.


