అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు | Fire Accident At Arora Life Science Factory In Sangareddy | Sakshi
Sakshi News home page

అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Nov 28 2024 6:39 AM | Updated on Nov 28 2024 8:52 AM

Fire Accident At Arora Life Science Factory In Sangareddy

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.

వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 

అయితే, రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక, రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement