కరోనా తీవ్రత పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తం

Field Awareness Programs On Corona Outbreak In Country - Sakshi

అవగాహనే అసలు మందు

వైరస్‌ను ఎదుర్కోవడంపై  క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన

బాధిత కుటుంబాలను చైతన్యపరచడంపై సూచనలు

కంటైన్మెంట్‌ జోన్లలో నిఘా బృందాలకు స్పష్టమైన ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండ టంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కేసులు ఎక్కు వగా ఉన్న కంటైన్మెంట్‌ జోన్ల నుంచి ఈ కార్యక్రమాలను వేగంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో నిఘా బృందాలను  పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బృందాలు చేపట్టా ల్సిన కార్యక్రమాలకు సంబంధించి కేంద్రఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనాను ఎదు ర్కోవడంలో అవగాహనే కీలకం. వ్యాధి లక్షణా లకు తగినట్లుగా స్పందించి జాగ్రత్తలు తీసు కుంటే ప్రమాదమేమీ కాదని, జాగ్రత్త చర్యల్లో నిర్లక్ష్యం చేస్తే మాత్రం దుష్పరిణామాలు తప్ప వని పలు పరిశీలనలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో నిఘా బృందాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతూ కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటి పరీక్షలకు కేంద్రం ఆదేశించింది.

నాలుగంచెల బాధ్యతలతో...
నిఘా బృందాలకు కేంద్రం నాలుగంచెల బాధ్యతలను అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా వ్యాప్తికి కారణాలను గుర్తిం చాలని పేర్కొంది. ఇందు కోసం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాల్సి ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న ఇళ్లను సందర్శించి పరిశీలిం చాలి. ఈ పరిశీలన తాలూకు నివేదికలను వైద్యశాఖకు సమర్పించాలి. అనంతరం కంటై న్మెంట్‌ జోన్లలో ఉన్న కుటుంబాలకు వైరస్‌ వ్యాప్తిపై అవగాహన కల్పించి జాగ్రత్త చర్యలను వివరించాలి. లక్షణాలు ఉన్న వారు తీసుకోవల్సిన జాగ్రత్తలు, హోం క్వారంటైన్‌ తదితరాలపై అవగాహన కల్పించాలి. అత్యవసర పరిస్థితిలో వైద్యుల సలహాలు తీసుకోవడం, సమీపంలో ఉన్న ఆస్పత్రి వివరాలు, అందుబాటులో ఉన్న పడకలకు సంబంధించిన సమాచారాన్ని ఈ జోన్‌లో అందుబాటులో ఉంచాలి. కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించే నిఘా బృందాలు కూడా పకడ్బందీ జాగ్రత్తలు పాటించాల్సిందిగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

పరీక్షలు... ఫాలోఅప్‌
నిఘా బృందాలకు అప్పగించిన బాధ్యతల్లో ప్రధానమైనవి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం, పాజిటివ్‌ వచ్చిన వారి బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. ఇంటింటి సర్వేలో అనుమానితులను గుర్తించి వారికి తక్షణ చర్యల్లో భాగంగా పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు బాధితులకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా క్వారంటైన్‌/ఐసోలేషన్‌ చేస్తారు. ఈ సమయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి వారిలో ఆత్మస్థైర్యం కల్పిస్తారు. అలాగే క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి అవసరమైన చికిత్సను అందించడంలో నిఘా బృందాలు కీలకపాత్ర పోషిస్తాయి.

లక్షణాలుంటే అలక్ష్యం వద్దు...
కరోనా సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో అలాంటి వారు ఎక్కువ మందితో కాంటాక్ట్‌ కావడంతో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేనివారు హోం క్వారంటైన్‌కు వెళ్లడాన్ని ఆరోగ్య శాఖ కచ్చితం చేసింది. అదేవిధంగా పాజిటివ్‌ వచ్చి స్వల్ప లక్షణాలున్నా వెంటనే జాగ్రత్త చర్యలు మొదలు పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. లక్షణాలకు తగినట్లుగా స్పందించి ఆ మేరకు చికిత్స ప్రారంభించాలి. నిఘా బృందాలు ఇచ్చే మందులను అలక్ష్యం చేయకుండా వాడితే వైరస్‌ నుంచి ప్రమాదం ఉండదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top