27 రోజులు.. 27 లక్షలు... ఐనా దక్కని ప్రాణం...!

Family Head Died Due To Coronavirus And Having Huge Loan - Sakshi

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా దక్కని ప్రాణం 

ఆస్పత్రులకు రూ.23 లక్షలు.. అంబులెన్స్‌లకు రూ. 4 లక్షలు 

 భర్తను కాపాడుకునేందుకు అందిన చోటల్లా అప్పు 

కుంగదీస్తున్న ఇంటి పెద్ద మరణం.. అప్పుల బాధలు  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఛిద్రమైన కుటుంబం 

తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం. నాలుగెకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూనే భార్య లత, కూతురు రేఖ, కొడుకు శివరామకృష్ణను పోషించుకుంటున్నాడు. కూతురు డిగ్రీ పూర్తిచేసింది. కొడుకు ఇంటర్‌ చదువుతున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో కరోనా భూతం కల్లోలం సృష్టించింది.

మే మొదటివారంలో శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారినపడ్డాడు. మొదట లక్షణాలు తెలియలేదు. కరోనా అని గుర్తించడంలో ఆలస్యమైంది. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. చేరిన ప్రతి ఆస్పత్రిలో రూ.లక్షల బిల్లు వేశారే కానీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. శ్రీనివాస్‌రెడ్డి గత నెల 30న ప్రాణాలు వదిలాడు. మొత్తం 27 రోజుల చికిత్సకు రూ.29 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఇందులో రూ.2 లక్షలు మంత్రి కేటీఆర్‌ సాయం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ భార్య, పిల్లలు కరోనా పాజిటివ్‌తో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. 

శ్రీనివాస్‌రెడ్డిని బతికించుకునే ప్రయత్నంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఇలా.. అన్ని చోట్లా లత అప్పు తెచ్చింది. వైద్య ఖర్చులు దాదాపు రూ.23 లక్షలు కాగా, అతడిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు, రవాణా ఖర్చులకు మరో రూ.4 లక్షల వరకు అయ్యాయి. రూ.27 లక్షల అప్పు తెచి్చనా శ్రీనివాస్‌రెడ్డి మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆ కుటుంబం తమకున్న నాలుగెకరాలు అమ్ముకునే దుస్థితి నెలకొంది. ఇంటి పెద్ద మరణం ఓవైపు.. అప్పుల బాధలు మరోవైపు వారిని కుంగదీస్తున్నాయి. భూమి అమ్మితేనే అప్పు తీరేది. అది అమ్మితే.. బిడ్డ పెళ్లి చేసేదెలా అని లత కన్నీరుమున్నీరవుతోంది. 

ఇదీ చికిత్సకైన ఖర్చుల లెక్క.. 

  • శ్రీనివాస్‌రెడ్డికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యాక మొదట సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స చేసి రూ.లక్ష బిల్లు వేశారు. 
  • అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌ తరలించి, కొంపల్లిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి రూ.1.50 లక్షల బిల్లువేశారు. తమ వల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. 
  • తర్వాత అల్వాల్‌లో ఉన్న మరో కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఏడు రోజులు చికిత్స చేసి రూ.7 లక్షల బిల్లువేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. 
  • చావుబతుకుల మధ్య ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఉప్పల్‌లో ఉన్న ఇంకో కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులు చికిత్స అందించి రూ.12 లక్షల బిల్లువేసి చేతులెత్తేసింది ఆసుపత్రి. 
  • ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలనే తపనతో శ్రీనివాస్‌రెడ్డిని మరో కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐదురోజులు చికిత్స అందించినా ప్రాణం దక్కలేదు. సదరు ఆస్పత్రి రూ.3.50 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పగా కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రూ.2 లక్షలు తాను చెల్లిస్తానని కేటీఆర్‌ హామీ ఇవ్వగా.. కుటుంబసభ్యులు మిగతా రూ.1.50 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు. 

‘‘మాయదారి కరోనా మా ఇల్లును ఆగం చేసింది. మా ఆయనను రోజుకో ఆస్పత్రి తిప్పిండ్రు. తమ వళ్ల కాదన్నరు. దినాం లక్షకు పైగా ఖర్చు చేసినం. అంబులెన్సుల్లో తిప్పినందుకే నాలుగు లక్షలు ఒడిసినయ్‌. అప్పు ఎలా తీర్చేది.. బిడ్డ పెళ్లి ఎలా చేసేది’’ 
–శ్రీనివాస్‌రెడ్డి భార్య లత   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-06-2021
Jun 04, 2021, 08:13 IST
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24...
04-06-2021
Jun 04, 2021, 04:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
04-06-2021
Jun 04, 2021, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజుల వసూలు ఆరోపణలకు సంబంధించి ఆస్పత్రులు, రోగులతో చర్చించి బాధితులకు రిఫండ్‌ చేసే విషయంలో చర్యలు...
04-06-2021
Jun 04, 2021, 01:38 IST
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గతేడాది(2020–21)లో వేతనాన్ని వొదులుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) పేర్కొంది....
03-06-2021
Jun 03, 2021, 19:52 IST
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు....
03-06-2021
Jun 03, 2021, 19:33 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే థర్డ్‌ వేవ్‌ ఆందోళన దేశ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా  థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై...
03-06-2021
Jun 03, 2021, 19:23 IST
బెంగళూరు: దేశంలో కరోనా ​ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్​వేవ్​లో వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు...
03-06-2021
Jun 03, 2021, 19:03 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,261 కరోనా కేసులు నమోదు కాగా.. 18 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా...
03-06-2021
Jun 03, 2021, 18:19 IST
సాక్షి, ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ ముందుకు...
03-06-2021
Jun 03, 2021, 17:46 IST
ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాక్సిన్ల విషయంలో రాజస్తాన్‌, పంజాబ్‌ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును గురువారం ట్విటర్‌లో...
03-06-2021
Jun 03, 2021, 16:48 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,25,682...
03-06-2021
Jun 03, 2021, 16:44 IST
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏ‍ళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి...
03-06-2021
Jun 03, 2021, 14:55 IST
లక్నో: కోవిడ్‌ వ్యాక్సిన్‌ బృందాన్ని చూసిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ టీకాకు భమపడి డ్రమ్‌ వెనుక దాక్కుంది....
03-06-2021
Jun 03, 2021, 12:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్​ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న...
03-06-2021
Jun 03, 2021, 11:03 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా లక్ష్యంలో భాగాంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ...
03-06-2021
Jun 03, 2021, 10:52 IST
ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు.. ...
03-06-2021
Jun 03, 2021, 10:14 IST
మైసూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్‌.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది....
03-06-2021
Jun 03, 2021, 08:18 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి...
03-06-2021
Jun 03, 2021, 06:15 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై అత్యధిక సామర్థ్యంతో పని చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌కు రావడానికి గల అడ్డంకులన్నీ...
03-06-2021
Jun 03, 2021, 05:33 IST
జగ్గయ్యపేట అర్బన్‌/లబ్బీపేట (విజయ వాడ తూర్పు): చనిపోయిందనుకున్న మనిషి కళ్లెదుట నిక్షేపంలా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. సరిగ్గా ఇలాంటి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top