లిక్కర్‌ స్కాం నిందితుడితో కవిత తిరుమల ఎందుకు వెళ్లారు?: రఘునందన్‌ రావు

elhi Liquor Scam: MLC Kavitha Photo With Ramachandra Pillai At Tirumala Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లిక్కర్‌ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫోటో తాజాగా వైరలవుతోంది. సీబీఐ కేసులో ఏ-14 రామచంద్ర పిళ్లై కుటుంబంతో తిరుమలలో కవిత కనిపించారు. బోయినపల్లి అభిషేక్‌రావుతో సహా ఆమె తిరుపతి టూర్‌కు వెళ్లారు. అయితే లిక్కర్‌ స్కాం నిందితుడితో ఎమ్మెల్యే కవిత తిరుమలకు ఎందుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లైని కలవలేదని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్‌ స్కామ్‌తో సంబంధం లేదన్న కవిత.. రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు.  

మరమనిషి అనేది నిషేధిత పదమా? అని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. మీరిచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఏదో కారణంలో సభ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు. బీఏసీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

దర్యాప్తు ముమ్మరం
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారంతో ముడుపులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ మద్యం టెండర్స్‌లో కంపెనీల సిండికేట్‌కు హైదరాబాద్‌లో రూపకల్పన జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో అయిదుచోట్ల ఢిల్లీ ఈడీ బృందం తనిఖీలు చేపట్టింది. రాబిన్‌ డిస్టలరీస్‌, డైరెక్టర్‌ కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది.

సికింద్రాబాద్‌, కోకాపేట్‌, నార్సింగ్‌లో సీబీఐ సోదాలు జరిపింది. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్‌ లావాదేవీలు స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌, కర్ణాటక, చెన్నై, ఢిల్లీలోని రామ చంద్రన్‌ పిళ్లై ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top