
ఈసీని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ వర్గీకరణ మే రకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించా లని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దా ఖలైంది. దీన్ని గతంలో దాఖలైన పిటిషన్లకు జత చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అప్పటి నుంచి మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో వర్గీకరణ లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ నోమాడిక్, సెమీనోమాడిక్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘విద్య, ఉపాధి కల్పనలో సంచార, డీనోటిఫైడ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు అందించడంలో అధికారుల వైఫల్యం రాజ్యాంగ విరుద్ధం. ఉమ్మడిగా 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తే ఆర్థికంగా ఎదిగిన కులాలు మాత్రమే లబ్దిపొందుతాయి. పేద బీసీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. జీవో 9ని నిలిపివేసి.. బీసీ వర్గీకరణతో కొత్త జీవో జారీ చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలి’అని నివేదించారు.