కరోనాకు కళ్లెం వేసిన లాక్‌డౌన్‌...

Due To Lockdown Corona Cases Decline In Telangana - Sakshi

లాక్‌డౌన్‌లో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు 

6.74 శాతం నుంచి 1.47 శాతానికి తగ్గుదల  

ఆస్పత్రుల్లో 52 శాతం నుంచి 16 శాతానికి తగ్గిన ఆక్యుపెన్సీ 

ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఎక్కువ మంది గుమికూడకపోవడం వంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు జనసంచారాన్ని కట్టడి చేస్తే వైరస్‌ తోక ముడుస్తుందని లాక్‌డౌన్‌  విధింపు తర్వాత నమోదైన కేసుల సరళి మరోసారి స్పష్టం చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్‌ తీవ్రత నెలాఖరుకు వచ్చేసరికి మరింత తీవ్రంగా మారింది. మే నెల మొదటి వారంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 8.69 శాతం నమోదైంది.

ఈ క్రమంలో అదే నెల 12వ తేదీన ప్రభుత్వం తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించింది. ఆ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో కట్టడి చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలిపింది. లాక్‌డౌన్‌ పెట్టిన మొదటి వారంలో కరోనా పాజిటివిటీ రేటు 6.74 శాతం నమోదు కాగా 29,778 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా గత వారంలో (ఈ నెల 9 నుంచి 13 వరకు) పాజిటివిటీ రేటు ఏకంగా 1.40 శాతానికి (8,369 కేసులు) పడిపోవడం గమనార్హం. అంటే ఐదు వారాల్లోనే దాదాపుగా ఐదో వంతు వరకు పడిపోయిందన్నమాట.  

మూడున్నర నెలలు విజృంభణ.. 
రాష్ట్రంలో గతేడాది మార్చి 2వ తేదీ నుంచి కరోనా కేసులు ప్రారంభం కాగా మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌లో వ్యాప్తి తీవ్రంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. ఈ నెల 13వ తేదీ వరకు మొత్తం 6.03 లక్షల కరోనా కేసుల నమోదు కాగా, అందులో సగం అంటే 3.04 లక్షల కేసులు సెకండ్‌ వేవ్‌లోనే నమోదు కావడం గమనార్హం. అంటే గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు సగం కేసులు నమోదైతే, గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు అంటే మూడున్నర నెలల్లోనే మిగిలిన సగం నమోదయ్యాయన్న మాట. మొత్తం 1.67 కోట్ల నమూనాలను పరీక్షించగా, అందులో ఈ మూడు నెలల్లోనే సగం మేరకు అంటే 80.02 లక్షల నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తంగా చూస్తే పాజిటివిటీ రేటు 3.60 శాతం ఉంటే, ఈ మూడున్నర నెలల సెకండ్‌ వేవ్‌లో 3.80 శాతంగా నమోదైంది.  

ముమ్మరంగా ఫీవర్‌ సర్వే.. 
కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో ప్రభుత్వం గత నెల ఐదో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నాలుగు రౌండ్ల సర్వేలు నిర్వహించారు. మొదటి రౌండ్‌లో 20,134 బృందాలు 1.13 కోట్ల ఇళ్లల్లో సర్వే చేయగా, 2.36 లక్షల మందిలో జ్వరం, తలనొప్పి ఇతరత్రా లక్షణాలు కనిపించాయి. రెండో రౌండ్‌లో 15,703 బృందాలు 99 లక్షల ఇళ్లల్లో సర్వే చేసి 1.34 లక్షల మందిలో లక్షణాలు గుర్తించారు. ఇక మూడో రౌండ్‌లో 14,482 బృందాలు 55.79 లక్షల ఇళ్లల్లో సర్వే చేసి 65,292 మందిలో, నాలుగో రౌండ్‌లో 2,394 బృందాలు 6.02 లక్షల ఇళ్లల్లో 4,862 మందిలో లక్షణాలు గుర్తించారు. లక్షణాలున్నవారికి మెడికల్‌ కిట్లను అందజేశారు.

95.91 శాతానికి పెరిగిన రికవరీ రేటు 
లాక్‌డౌన్‌ మొదలైన తొలి వారంలో రాష్ట్రంలో రికవరీ రేటు (కోలుకున్నవారు) 90.47% ఉం డగా, ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ, గత వారంలో 95.91 శాతానికి చేరింది. అలాగే లాక్‌డౌన్‌ మొదటి వారంలో ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ ఏకంగా 52 శాతం కాగా, గత వారంలో అది ఏకంగా 16 శాతానికి పడిపోయింది.    

చదవండి: కరోనా గుణపాఠాలు..  భవిష్యత్‌  వ్యూహాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-06-2021
Jun 16, 2021, 08:14 IST
సాక్షి, మంచిర్యాలటౌన్‌: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది....
16-06-2021
Jun 16, 2021, 07:01 IST
న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20...
16-06-2021
Jun 16, 2021, 06:38 IST
న్యూయార్క్‌: చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా...
16-06-2021
Jun 16, 2021, 04:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్‌ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న...
16-06-2021
Jun 16, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్‌ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని...
16-06-2021
Jun 16, 2021, 02:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి...
15-06-2021
Jun 15, 2021, 20:14 IST
డెహ్రాడూన్‌: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల...
15-06-2021
Jun 15, 2021, 20:10 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం...
15-06-2021
Jun 15, 2021, 18:51 IST
కోల్‌కతా: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాకా కొందరు తమ శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలే నాసిక్‌కు చెందిన...
15-06-2021
Jun 15, 2021, 17:50 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో  96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు బయటపడ్డాయి....
15-06-2021
Jun 15, 2021, 12:59 IST
వాషింగ్టన్‌: దేశీయ పార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్‌ తీసుకున్న భారతీయ...
15-06-2021
Jun 15, 2021, 11:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో దేశంలో దాదాపు 73 శాతం వృద్ధులపై...
15-06-2021
Jun 15, 2021, 10:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో...
15-06-2021
Jun 15, 2021, 09:40 IST
న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ నిధుల నుంచి దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ చీఫ్‌...
15-06-2021
Jun 15, 2021, 09:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ...
15-06-2021
Jun 15, 2021, 08:24 IST
సాక్షి, నెట్‌వర్క్‌ (నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304మంది మహమ్మారి బారిన...
15-06-2021
Jun 15, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు....
15-06-2021
Jun 15, 2021, 05:09 IST
తిరుపతి తుడా: కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యమే సగం బలం అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం...
15-06-2021
Jun 15, 2021, 03:50 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఎక్కువగా డబుల్‌ మ్యూటెంట్లదే కీలకపాత్ర అని తాజా అధ్యయనంలో తేలింది. మొదటి...
14-06-2021
Jun 14, 2021, 19:23 IST
వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు  ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top