దుబ్బాక: బీజేపీ అభ్యర్థి ఇంట్లో పోలీసుల సోదాలు

Dubbaka By Polls: Police Searches In BJP Candidate Home - Sakshi

రఘునందన్‌ మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం

సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్‌ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారు. చదవండి: దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్‌ రావు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top