దుబ్బాక నిధులు సిద్దిపేట‌కు త‌ర‌లించారు

Dubbaka Elections :  Congress Leaders Participated In Campaign  - Sakshi

సిద్దిపేట  : దుబ్బాక ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చింతమడకలో చదువుకున్న అని చెప్పుకునే కెసిఆర్..చింతమడక తరహా పది లక్షలు పెద్దగుండవెళ్లిలో ఎందుకు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు. దుబ్బాకకు సిద్దిపేట నుంచి 40 సంవత్సరాల నుండి దాయాదుల పోరు ఉంద‌ని,   దుబ్బాకకు వచ్చిన అనేక నిధులు సిద్దిపేటకు తరలించార‌ని ఆరోపణ‌లు గుప్పించారు. మూడు నియోజకవర్గాల మద్య ఉన్న దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే రామలింగారెడ్డి మీ చేతిలో చిప్ప పెట్టిండు.  హరీష్ రావు సిద్దిపేట నుండి వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లడుగుతుండు. నాలుగు సార్లు గెలిపిస్తే చేయని అభివృద్ధిని మళ్లీ చేస్తాడంటే నమ్ముతమా. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ను 100 అడుగుల లోతుకు పాతిపెట్టాలి అంటూ రేవంత్ విమ‌ర్శ‌నస్ర్తాలు సంధించారు. (దుబ్బాక ఉప ఎన్నిక‌: ఎవరి ధీమా వారిదే)

క‌ల్వ‌కుంట్ల మాట‌లు న‌మ్మి మోస‌పోయారు
న‌వంబ‌ర్‌3న జ‌రిగే ఎన్నిక‌ల్లో హ‌స్తం గుర్తుకు ఓటేసి గెలిపించాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కోరారు. ఇప్ప‌టికే  ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని, మ‌రోసారి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌న్నారు. ముత్యంరెడ్డి ,  రామలింగారెడ్డి ఎవ‌రి హయాంలో  అభివృద్ధి జ‌రిగిందో పోల్చి చూడాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.   స్వయానా రామలింగారెడ్డి అసెంబ్లీలో నేనేమి చేయలేకపోతున్న అన్నారని, మ‌రి ఆయ‌న స‌తీమ‌ణితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అంటూ ప్ర‌శ్నించారు. బీజేపీ అభ్య‌ర్థి రఘునందన్ గెలిస్తే టిఆర్ఎస్‌లోకి  పోతాడ‌ని,  రఘునందన్, హరీష్ రావు బంధువులని పేర్కొన్నారు. బిజెపికి ఓటేస్తే వృధా అవుతుందని, దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top