ఆధార్‌ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు

Dont Ask For Aadhaar Details For Dharani High Court Orders To Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్‌ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ కాలమ్‌ తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, పీటీఐఎన్‌ నిలిపేయాలని.. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. గురువారం ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసింది. ( ‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలే..!’)

రిజిస్ట్రేషన్‌లు యధావిధిగా కొనసాగించాలని, కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని.. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్  మినహాయించి  ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని.. సాఫ్ట్‌వేర్‌, మ్యానువల్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top