ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త! | Documents Required For The Voter List | Sakshi
Sakshi News home page

ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఓటు పోతుంది జాగ్రత్త!

Jul 6 2026 1:52 PM | Updated on Jul 6 2026 2:48 PM

Documents Required For The Voter List

‘సర్‌’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. సర్‌ ప్రక్రియలో భాగంగా వ లస వెళ్లినా, చనిపోయినా, డబుల్‌ ఎంట్రీ ఉన్నా ఆ ఓట్లు తొలగిస్తారు. అయితే ఏమరపాటుగా ఉన్నా సరే ఓటు పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రక్రియపై అవగాహన తప్పనిసరి.

ఓటర్లు ఏం చేయాలంటే..

  • బీఎల్‌ఓ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఓటరుకు వారి ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇస్తారు.

  • 2002 ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఆ వివరాలను ఆ పత్రంలో పేర్కొనాలి. పేరు లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్త, లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి.

  • పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, తండ్రి /లేదా సంరక్షకుడి పేరు, తల్లి, భార్య, భర్త పేరు, వారి ఫొటొ గుర్తింపు కార్డు (ఎపిక్‌) నంబర్‌ నింపాలి.

  • కొత్తగా దిగిన పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు రెండు ఇవ్వాలి.

  • పూర్తిచేసిన పత్రాలను ఒకటి బీఎల్‌ఓ తీసుకుని, మరోదానిపై సంతకం చేసి ఓటరుకు రశీదుగా అందిస్తారు.

  • ఓటర్ల తరఫున వేరే వ్యక్తులు ఈ ఫారాలు అందిస్తే బంధుత్వం పేర్కొనాలి.

  • 40 ఏళ్లు దాటి, వారసత్వ డాక్యుమెంట్లు లేకపోతే భయపడాల్సిన పని లేదు. వారి తల్లిదండ్రుల లేదా బంధువుల ఓటరు కార్డు నంబర్‌, లేదా ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డు వివరాలు ఇస్తే సరిపోతుంది.

అప్రమత్తంగా ఉండాల్సిందే..

  • ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సిద్ధం చేసుకోవాలి.

  • ఈ నెల 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే ఆగస్టు 20లోగా అభ్యంతరం తెలియజేయాలి.

  • వాటిని పరిష్కరించి సెప్టెంబర్‌ 22న తుది జాబితా విడుదల చేస్తారు.

  • బీఎల్‌ఓలు ఇంటిని మూడు సార్లు సందర్శించిన్పటికీ ఓటరు అందుబాటులో లేకపోతే ఆ ఇంటికి నోటీసుల అతికించి, ఓటు తొలగింపుపై ఉన్నతాధికారులకు నివేదిస్తారు.

  • అందుబాటులో లేని కారణంగా ఏ ఒక్కరి ఓటు హక్కును తొలగించేందుకు బీఎల్‌ఓలు ప్రతిపాదించకూడదు. ఓటు తొలగితే ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదీ లేకపోతే ఓటు హక్కు కోల్పోతారు.

  • 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పిస్తే ఓటు నమోదు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement