అశ్వమెక్కి.. ఆర్డర్‌ అందించి | Delivery Agent Drops Order In Hyderabad On A Horse | Sakshi
Sakshi News home page

అశ్వమెక్కి.. ఆర్డర్‌ అందించి

Jan 3 2024 10:10 AM | Updated on Jan 3 2024 10:33 AM

Delivery Agent Drops Order In Hyderabad On A Horse - Sakshi

హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్‌ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్‌ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్‌ అయిపోయింది.

బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్‌లోని ఇంపీరియల్‌ హోటల్‌లో పార్శిల్‌ తీసుకుని చంచల్‌గూడలో కస్టమర్‌కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement