హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై దురుద్దేశ పూర్వకంగానే ఏబీఎన్ కథనాలు రాసిందని దళిత సంఘాలు మండిపడ్డాయి. డిప్యూటీ సీఎంపై ఏబీఎన్ రాసిన తప్పుడు కథనాలను ఖండించాయి దళిత సంఘాలు.
ఈ మేరకు దళిత సంఘాల నేతలు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ..‘‘ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. భట్టిపై దురద్దేశపూర్వకంగాకథనాలు రాశారు. నైనీ బ్లాక్‌పై ఆంధ్రజ్యోతిది ఊహాజనిత వార్త.
ఇంధన శాఖకు భట్టి అర్హలు కారని ఎలా రాస్తారు?, భట్టి ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు. పెద్ద వాళ్ల మెప్పు కోసమే తప్పుడు వార్తలు రాశారు’ అని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.


