హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ | Cyberabad Police Restrictions On New Year Celebrations In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. ఈ ఫ్లైఓవర్లపై నో ఎంట్రీ

Dec 27 2023 6:53 PM | Updated on Dec 27 2023 9:10 PM

Cyberabad Police Restrictions On New Year Celebrations In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.

సైబరాబాద్‌ పరిధిలోని శిల్పా లే అవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్‌, సైబర్‌ టవర్‌, ఫోరం మాల్‌, జేఎన్టీయూ, ఖైతలాపూర్‌, బాలానగర్‌ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు వంతెనలను 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వెల్లడించారు.

 న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సైబరాబాద్‌ పోలీసులు ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను వాట్సప్‌ నెంబర్‌ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పబ్‌లలో మద్యం సేవించి వాహనం నడపకుండా  చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణం అయితే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. .

చదవండి: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement