బీజేపీ ఎమ్మెల్యేకు సీపీ సజ్జనార్‌ కౌంటర్‌.. | Cyberabad CP Sajjanar Counter To BJP MLA Raja Singh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లీగల్‌ చర్యలు 

Dec 22 2020 4:10 PM | Updated on Dec 22 2020 6:55 PM

Cyberabad CP Sajjanar Counter To BJP MLA Raja Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలకు సైబరాబాద్  సీపీ  సజ్జనార్ కౌంటర్‌ ఇచ్చారు. పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీ తప్పుబట్టారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై లీగల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. (చదవండి: లోన్‌యాప్స్‌ కేసులో ఆసక్తికర విషయాలు)

ఆర్‌బీఐ దృష్టికి ఇన్‌స్టంట్‌ లోన్ల వ్యవహారం..
ఇన్‌స్టంట్‌ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. క్యాష్ మామా, లోన్‌ జోన్‌, ధనాధన్‌ పేర్లతో లోన్‌లు ఇస్తున్నారని, ఇన్‌స్టంట్‌ లోన్లు వ్యవహారాన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గంలో రెండు కంపెనీలను గుర్తించామని, రెండు కంపెనీల్లో 110 మందికి పైగా టెలీకాలర్స్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆరుగురు కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, 22 ఫోన్లు, 18 బ్యాంక్ అకౌంట్లలో 1.52 కోట్లు సీజ్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు.(చదవండి: శభాష్‌.. తెలంగాణ పోలీస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement