Telangana: పాస్‌ మార్కులు చాలు.. ఆ నిబంధన ఎత్తివేస్తూ ఉత్తర్వులు

Covid 19: TS Government Key Decision Over Entrance In Professional Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా అధికారులతో సమావేశమైన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ అంశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇంటర్‌ మార్క్స్‌(కచ్చితంగా ఇన్ని మార్కులు ఉండాలనే) నిబంధన ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: Afg​hanistan Crisis:‍ భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్‌ ధరలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top