
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 516 మందికి కోవిడ్–19 నిర్ధారణైంది. శుక్రవారం 220 మందికి, శనివారం మరో 296 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,302 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 6,52,085 మంది కోలుకున్నారు. శనివారం ఒకరు మరణించారు.