రాష్ట్రపతి పర్యటన భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు | Corona Tests For Security Staff During President Visit In Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటన భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు

Dec 27 2022 12:49 AM | Updated on Dec 27 2022 2:44 PM

Corona Tests For Security Staff During President Visit In Telangana - Sakshi

పాలంపేట గ్రామపంచాయితీ ఆవరణలో  కోవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది   

వెంకటాపురం (ఎం): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో పా­ల్గొనే భద్రతా సిబ్బందికి సో­మ­వారం పాలంపేట గ్రామ­పంచా­యతీ ఆవరణలో కరోనా ప­రీక్షలు నిర్వహించా­రు. బుధ­వా­రం రాష్ట్రపతి ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండ­లంలోని చారిత్రక రామప్ప ఆలయానికి రానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేశారు.

దేశంలో నాలుగో వేవ్‌ బీఎఫ్‌–7 వేరియెంట్‌ ప్రారంభం కావడంతో వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా రామప్పలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు? ఎమైనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయా? అనే విషయమై వైద్యాధికారులు ప్రకటించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement