హైదరాబాద్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం | Corona Positive For Four SIs And Constables At SR Nagar PS | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం

Dec 7 2020 5:31 PM | Updated on Dec 8 2020 8:14 AM

Corona Positive For Four SIs And Constables At SR Nagar PS - Sakshi

తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య సల్పంగా నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో నలుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. గత జూన్ నెలలో వచ్చిన వారికి మరోసారి పాజిటివ్ రావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు గ్రేటర్ ఎలక్షన్లలో భాగంగా డ్యూటీలు చేసిన ఎస్ఐలకు, కానిస్టేబుళ్లు, సిబ్బందికి రెండోసారి కోవిడ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తుంది. (చదవండి: 2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది)

Advertisement
 
Advertisement
Advertisement