కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీతక్క.. పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు

Congress Sitakka Casted Her Vote To Droupadi Murmu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్‌ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క తెలిపారు. 

అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ మీద పడింది. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్స్‌లో వేశాను.
నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top