
సాక్షి, నల్గొండ: అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మార్నేని మధుమోహన్ (44) జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పై అధికారుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్ రాసి పెట్టాడు.