పుష్పరాజ్‌ వీడియోకు స్పందించిన సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Responds To Allu Arjun Latest Anti-Drugs Awareness Video, More Details Inside | Sakshi
Sakshi News home page

పుష్పరాజ్‌ వీడియోకు స్పందించిన సీఎం రేవంత్‌

Published Fri, Nov 29 2024 10:11 PM | Last Updated on Sat, Nov 30 2024 11:31 AM

Cm Revanth Responds To Pushparaj Video

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జున్‌ ప్రత్యేక వీడియో చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్‌ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’’ అంటూ విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశారు.

సీఎం పోస్టుకు బన్నీ రిప్లై ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు.. హైదరాబాద్‌ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.

‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్‌ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అంటూ అల్లు అర్జున్‌ వీడియో ద్వారా పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement