సాక్షి, హైదరాబాద్: మూసారం బాగ్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు (సోమవారం)అంబర్‌పేటలో సీఎం రేవంత్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలేరు వెంకటేష్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, బలాల తదితరులు పాల్గొన్నారు.
మూసీవరదలతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష 50 వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా బ్రిడ్జిని నిర్మించారు. దీని ప్రారంభంతో ఇక వర్షాకాలంలో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి.


