కరీంనగర్: ఎథిక్స్ కమిటీ విచారణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎథిక్స్ లేంది ఎవరికి అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగేటోళ్లకా? లేక అధికారంలో లేకపోయినా ఏ పార్టీ నుంచి అయితే గెలిచామో అ పార్టీ వైపే నిలబడి ప్రజా సమస్యలపై కొట్లాడేటోణికా..? అని నిలదీశారు. అసలు ఎథిక్స్ ఉన్నది ఎవరికీ..? మాకా, అమ్ముడుబోయినోణికా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడ్ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై సెప్టెంబర్ 2 నుండి చేపట్టే బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ అసలు ఎథిక్స్ నాకు లేవా.. పిటిషన్ ఇచ్చినోళ్లకా?, ఈ విషయంపై ఈ నెల 8వ తేదీ తర్వాత మరింత స్పందిస్తా. ఎథిక్స్ కమిటీనే ఆలోచన చేసుకోవాలి ఎవరికి ఎథిక్స్ ఉన్నాయో?’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పోలీసులు తమాషా చూస్తున్నారా?: బండి సంజయ్


