హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌.. ప్రారంభించిన సీఎం | Cm Revanth Inaugurates And Lays Foundation Stones For Development Projects | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌.. ప్రారంభించిన సీఎం

Dec 3 2024 6:40 PM | Updated on Dec 3 2024 7:27 PM

Cm Revanth Inaugurates And Lays Foundation Stones For Development Projects

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ విభాగం పరిధిలో రూ. 5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ విభాగం పరిధిలో రూ. 5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నగరంలో రెండో అతిపెద్ద ప్లై ఓవర్‌(జూపార్క్‌ టు ఆరాంఘర్‌)ను సీఎం ప్రారంభించారు. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో హెచ్‌సీఐటీసీ ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ జల మండలి (హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. రూ.669 కోట్ల అంచనాలతో ప్రభుత్వం చేపట్టింది.

తాగునీటి సరఫరాకు ఔటర్‌ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించిన సీఎం.. హైదరాబాద్ రోడ్స్‌ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో​ ఉన్న పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్ వేర్‌ను లాంఛనంగా సీఎం ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement