దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్‌

CM KCR Conducts Awareness Programme On Dalitabandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్‌ నియోజకవర్గ దళితులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 400 మందికిపైగా మంది దళిత ప్రతినిధులు హాజరయినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top