Telangana CM KCR Childhood Friend Passed Away | గుండెపోటుతో సీఎం బాల్య మిత్రుడు మృతి - Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సీఎం బాల్య మిత్రుడు మృతి

Feb 12 2021 2:20 PM | Updated on Feb 12 2021 2:45 PM

CM KCR Childhood Friend Passed Away in Kondapalkala Village - Sakshi

సంపత్‌కుమార్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న సీఎం కేసీఆర్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్‌ ఆ రోజు సంతోషపడ్డారు.

సాక్షి, మానకొండూర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్ననాటి స్నేహితుడు, కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్‌కుమార్‌ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కేసీఆర్, సంపత్‌కుమార్‌ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని, ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు.

సీఎం హోదాలో కేసీఆర్‌ కొన్ని నెలల క్రితం కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్‌ వెళ్లారు. సంపత్‌కుమార్‌ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్‌ ఆ రోజు సంతోషపడ్డారు. కాగా, సంపత్‌కుమార్‌ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. 

చదవండి:
పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి 

సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీల​క ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement