Chicken Prices Increased in Telugu States - Sakshi
Sakshi News home page

Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్‌ ధరలు

May 12 2022 5:27 PM | Updated on May 12 2022 8:21 PM

Chicken Prices Increased Telugu States - Sakshi

హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్‌ సెంచరీ దాటింది స్కిన్‌లెస్‌ చికెన్‌ కేజీ ధర.

ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చికెన్‌ డిమాండ్‌ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్‌లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. 

కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్‌.. రెస్టారెంట్‌లలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement