
సాక్షి,హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారు. స్థలం పేరుతో నిమ్స్ డిప్యూటీ సూపరీడెంట్ రూ.50 లక్షలు కాజేశారు. కోర్టు సిఫారసుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ భాస్కర్‌పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలున్నాయి.
తనకి గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడి ఉందని బాధితుడని లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు గురిచేశారు. ఈక్రమంలో లక్ష్మీ భాస్కర్‌తో పాటు ఆయనకు సహకరించిన మరికొందరి పైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.