
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్‌రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్‌రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.
రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్
రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.