బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌ | Bjp Mp Cm Ramesh Hulchul In Banjara Hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌

Mar 22 2026 3:29 PM | Updated on Mar 22 2026 5:08 PM

Bjp Mp Cm Ramesh Hulchul In Banjara Hills

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్‌చల్‌ చేశారు. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌-2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. ఇవాళ ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్న సీఎం రమేష్‌ హడావుడి చేశారు.

2006లో శివనారాయణ అనే వ్యక్తి.. సర్వే నెంబర్‌ 129/1లో ప్లాట్‌ నంబర్‌లు 29,30ల్లో భూమి కొనుగోలు చేశారు. ప్రభాత్‌ సొసైటీ వివాదాస్పద స్థలంలో సీఎం రమేష్‌ కబ్జాకు యత్నించినట్లు సమాచారు. తన భూమిని సీఎం రమేష్‌ కబ్జాకు యత్నించారని శివనారాయణ ఆరోపిస్తున్నారు.  మా భూమిలోకి ఎవరూ రావొద్దని ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉంది. 2006 నుంచి సీఎం రమేష్‌ ఇబ్బందిపెడుతున్నారు’’ అని శివనారాయణరెడ్డి తెలిపారు. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ చేరింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement