పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి | Bhatti Vikramarka Reacts On Prashant Kishor Joining In Congress Hyderabad | Sakshi
Sakshi News home page

పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి

Apr 24 2022 5:36 PM | Updated on Apr 24 2022 5:36 PM

Bhatti Vikramarka Reacts On Prashant Kishor Joining In Congress Hyderabad - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ అంశం మీడియాలో మాత్రమే చర్చ జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీఏల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో పీకేకి సంబంధ ఎలాంటి చర్చలేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అందరం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు.

తమకు సమయం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ సభ కోసం మీడియాతో మాట్లాడుతామని చెప్పారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మే వాళ్లందరూ రావాలని కోరుతున్నామని చెప్పారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి రావాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయంపై కాంగ్రెస్‌ ఏం చేస్తుందనేది సభలో చెబుతామని భట్టి తెలిపారు. తాము ఇచ్చిన సబ్సిడీలు అన్ని బంద్ అయ్యాయని చెప్పారు. రుణమాఫీ భారం లక్ష పోయి.. నాలుగు లక్షలు అయ్యిందని తెలిపారు. తాము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తుందనేది రాహుల్ గాంధీ సందేశం ఇస్తారని చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement